వరం
నిండీ నిండని కడుపుతో ఏ నోము నోచిందో
చాలీ చాలని బట్టతో ఏ పూజ చేసిందో
తలకెత్తుకున్న గంపతో ఏ వ్రతమాచరించిందో
బక్క చిక్కిన దేహంతో ఏ దేవుని మెప్పించిందో గానీ
మన పెదవులపై మెరుపులా మెరిసి మాయమయ్యే చిరునవ్వును
తన పెదవులపై శాశ్వతంగా నిలిచే వరం పొంది
ఎందరికి స్ఫూర్తిదాయకమైందో
ఈ చిన్నారి ప(ని)సి పాప.
*********
కష్టాలెన్ని ఉన్నా చెరగని ఆ నవ్వు అందరికీ సొంతం కాదులెండి.Good one
ReplyDeleteచెరగని చిరునవ్వు ఎన్నో కష్టాలను అధిగమించగలదని తెలియని వారెందరో . మీ స్పందనకు ధన్యవాదాలు
DeleteSo cruel are the ' adults ' who are stealing the childhood of this innocent and blssful girl !
ReplyDeleteyes sir you are right thats y they r loosing that blsful smile
DeleteWow!!!చాలా బాగుంది వీణా లహరి గారు :)
ReplyDelete"The most beautiful smile is the one that struggles through tears":)
kavya garu thanks for your quote n your comment
Deleteశ్రీ వీణాలహరి గారికి, నమస్కారములు.
ReplyDeleteకవిత చాలా సహజంగా వుంది. అందమైన పువ్వులు ఎన్నో పూస్తాయి, కానీ, సువాసన వున్న పూలు కొన్నే వుంటాయి. బహుశా, చిరునవ్వు చెరగని ఈ చిన్నారి ఆ పువ్వులాంటిదేమో!!
మీ స్నేహశీలి,
మాధవరావు.
మాధవరావు గారికి నమస్కారాలు,
Deleteమీరన్నది నిజమేనండి. మీ స్నేహపూర్వక స్పందనకు ధన్యవాదాలు
పసిపిల్లల్లా స్వచ్చంగా నవ్వడం ఒక వరం...
ReplyDeleteసరళంగా...బాగా వ్రాసారు...వీణ గారూ!...@శ్రీ
అవును శ్రీ గారు ఈ మధ్య చాలామంది ఈ వరానికి దూరమౌతున్నారు మీ అభిమాన స్పందనాకు ధన్యవాదాలు
Deleteనిజమే,..ఆ చిరునవ్వు శాశ్వితం గా నిలిచేనా...
ReplyDeleteనిలవాలని కోరుకుందాం భాస్కర్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు
Deleteతన దయనీయ జీవన స్థితిని చెప్తూనే తన గుండె నిబ్బరాన్ని చెరగని చిరునవ్వుతో పోలుస్తూ కవిత్వీకరించడం చాలా నచ్చిందండీ వీణాలహరి గారు....
ReplyDeleteమీరు మెచ్చినందుకు ధన్యవాదాలు వర్మ గారు
Delete
ReplyDeleteమీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.
babayi garu dhanyavaadaalu
Delete