Saturday 3 November 2012

చెలిమి

చెలిమి 
నాడు అందమైన పూల పరిమళాలెన్నిటినో కాదని 
నా చరణాలకు పానుపై అమరిన 
ఆ పచ్చికకు పూచిన చిన్ని పూవు 
నాకందించిన ఆనందాన్ని నీతో పంచుకున్న 
ఆ జ్ఞాపకం నేటికీ నాలో సజీవమే
 
నాడు ఆ చిన్ని లేగదూడ చిరుగంటల సంగీతానికి 
నా మువ్వల సవ్వడికి నడుమ జరిగిన పోటీలో 
ఆనందంగా ఓడిన ఆ అందమైన అనుభవాన్ని 
నీతో పంచుకున్న మధురక్షణాలూ నేటికీ  సజీవమే 
 
నాడు జాబిలి చేయందుకుని చల్లని వెన్నెలలోకంలో 
విహరించిన అద్భుతమైన నా కలల ప్రపంచాన్ని 
నీ ముందు ఆవిష్కరించి నిన్నుక్కిరిబిక్కిరి చేసిన 
ఆ సరదా సంగతులూ సజీవమే 
 
నాడు నీ చెలిమిన అలుపన్నది ఎరుగక 
నీతో పంచుకున్న ప్రతిక్షణమూ నాలో సజీవమే 
 
నేడూ ఎన్నోఅందమైన అనుభవాలు 
మధురానుభూతులు, అద్భుతమైన ఊహలు 
చిన్న చిన్న గాయాలు, తుళ్ళిపడే ఆనందాలు 
నీతో పంచుకోవాలని ఎంత ఆరాటమో ఈ మనసుకి 
కానీ కరిగిన బాల్యం పెరిగిన వయసు అంటూ 
 చెలిమికి  హద్దులు గీసీలోకం 
నిన్ను నాకు దూరం చేసింది 
ఐతేనేం పసిపాప మనసులాటి నిష్కల్మషమైన మన చెలిమి 
ఏదో నాటికీ లోకానికి తెలియక పోదు  
అంతవరకు  సజీవమైన నీ జ్ఞాపకాలతో
మరిన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుని నీకై నిరీక్షిస్తూ 
నీ నేస్తం......
*********
 
 
 
 
  

7 comments:

  1. chalaa baagunnaayi mee madhura smrutula savvadulu...@sri

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు ధన్యవాదాలు

      Delete
  2. ' అంత వరకూ సజీవమైన నీ జ్ఞాపకాలతో
    మరిన్ని జ్ఞాపకాలు పోగు చేసుకుని
    నీకై నిరీక్షిస్తున్న నీ నేస్తం ! '
    మీ చెలిమి ని ఎంత అందం గా వర్ణించారు వీణ గారూ !

    ReplyDelete
    Replies
    1. సుధాకర్ గారు ధన్యవాదాలు

      Delete
  3. భాస్కర్ గారు ధన్యవాదాలు

    ReplyDelete