Monday 5 November 2012

వరం

 వరం
నిండీ నిండని కడుపుతో ఏ నోము నోచిందో 
చాలీ చాలని బట్టతో ఏ పూజ చేసిందో 
తలకెత్తుకున్న గంపతో ఏ వ్రతమాచరించిందో 
బక్క చిక్కిన దేహంతో ఏ దేవుని మెప్పించిందో గానీ 
మన పెదవులపై మెరుపులా మెరిసి మాయమయ్యే  చిరునవ్వును 
తన పెదవులపై శాశ్వతంగా నిలిచే వరం పొంది
ఎందరికి స్ఫూర్తిదాయకమైందో 
ఈ చిన్నారి ప(ని)సి పాప.
*********

16 comments:

  1. కష్టాలెన్ని ఉన్నా చెరగని ఆ నవ్వు అందరికీ సొంతం కాదులెండి.Good one

    ReplyDelete
    Replies
    1. చెరగని చిరునవ్వు ఎన్నో కష్టాలను అధిగమించగలదని తెలియని వారెందరో . మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  2. So cruel are the ' adults ' who are stealing the childhood of this innocent and blssful girl !

    ReplyDelete
    Replies
    1. yes sir you are right thats y they r loosing that blsful smile

      Delete
  3. Wow!!!చాలా బాగుంది వీణా లహరి గారు :)
    "The most beautiful smile is the one that struggles through tears":)

    ReplyDelete
    Replies
    1. kavya garu thanks for your quote n your comment

      Delete
  4. శ్రీ వీణాలహరి గారికి, నమస్కారములు.

    కవిత చాలా సహజంగా వుంది. అందమైన పువ్వులు ఎన్నో పూస్తాయి, కానీ, సువాసన వున్న పూలు కొన్నే వుంటాయి. బహుశా, చిరునవ్వు చెరగని ఈ చిన్నారి ఆ పువ్వులాంటిదేమో!!

    మీ స్నేహశీలి,
    మాధవరావు.

    ReplyDelete
    Replies
    1. మాధవరావు గారికి నమస్కారాలు,
      మీరన్నది నిజమేనండి. మీ స్నేహపూర్వక స్పందనకు ధన్యవాదాలు

      Delete
  5. పసిపిల్లల్లా స్వచ్చంగా నవ్వడం ఒక వరం...
    సరళంగా...బాగా వ్రాసారు...వీణ గారూ!...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. అవును శ్రీ గారు ఈ మధ్య చాలామంది ఈ వరానికి దూరమౌతున్నారు మీ అభిమాన స్పందనాకు ధన్యవాదాలు

      Delete
  6. నిజమే,..ఆ చిరునవ్వు శాశ్వితం గా నిలిచేనా...

    ReplyDelete
    Replies
    1. నిలవాలని కోరుకుందాం భాస్కర్ గారు మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  7. తన దయనీయ జీవన స్థితిని చెప్తూనే తన గుండె నిబ్బరాన్ని చెరగని చిరునవ్వుతో పోలుస్తూ కవిత్వీకరించడం చాలా నచ్చిందండీ వీణాలహరి గారు....

    ReplyDelete
    Replies
    1. మీరు మెచ్చినందుకు ధన్యవాదాలు వర్మ గారు

      Delete

  8. మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభకామనలు.

    ReplyDelete