Tuesday 21 August 2012

ఆతిథ్యం 

ఆతిథ్యం 
ఆతిథ్యమంటే ఏమిటో
ఇంటికి వచ్చిన అతిథికి
అందమైన రూపునిచ్చి పంపే
ఆ ఆల్చిప్పను చూసి నేర్చుకోవాలి
ఏమంటారు?
*******

Tuesday 14 August 2012

కల-నిజం

కల-నిజం 
మూసినా కనురెప్పల వెనుక స్వప్నం 
జీవితంలో ఎన్నడూ చూడని అందమైన రంగులు చూపుతూ 
తీరని కోర్కెలు తీర్చుతూ ఆనందడోలికల్లో ఊయలూగిస్తుంటే 
పరవశాన జారిన ఒక్కో ఆనందబాష్పం ఓ మకరంద బిందువు 
ఆ మకరందాన్నాస్వాదించేలోపే తట్టి లేపిందా వాస్తవం 
నా ఆశల, ఊహల, భావాల, మాటల గొంతునొక్కి,
తెరచిన నా కనులకు సంద్రపు బిందువులనలంకరించి,
మౌనమనే రంగు నా పెదవులకద్ది.
నిజం! భావాలొలికే నా కన్నులు గానీ 
పలికే నా పెదవులు గానీ ఎవరికవసరం?
భావ విహీనమైన నా మోము, అలంకృతమైన నా దేహం 
చాలును కదా మరి వారికి.
*********

Thursday 9 August 2012

బృందావని

బృందావని 
 
తన ప్రతిబింబాన్ని చూడగోరినదై
యమునా తటి పై వంగిన ఆ రాధికను
చెంత చేర్చుకు ఆ నీటి అద్దాన్ని మించిన
అందమైన నిజాన్ని తన కన్నులు చెబుతాయంటుంటే
సిగ్గుతెరలు తొలగించుకుని ఆ కొంటె వాని కన్నులలోకి చూచినా రాధిక
తన్మయత్వమున తనను చూచుకొనుట మరచె
ఆ నల్లవాని రూపమును తనివితీరా చూస్తున్న ఆ తన్మయిని
మోహావేశమున చూస్తూ మైమరచినాడా మాధవుడు
అంత తన్మయులైనా రాధామాధవుల జూచి ధన్యత నొందెనా బృందావని.
***********


Thursday 2 August 2012

రెక్కలు తొడిగిన పసితనం

రెక్కలు తొడిగిన పసితనం 


నా పసితనమంతటి అమాయకత్వం 
నా బోసినవ్వంతటి స్వచ్ఛత 
నా ఆటలాంటి ఆనందం 
నా పాటలంత మాధుర్యం
నా మనసంతటి సున్నితత్వం 
నా అంతటి అందం 
నా అల్లరంత సంతోషం 
మరెక్కడైనా ఉందేమోనని 
రెక్కలు కట్టుకుని మరీ వెతికాను 
కానీ ఎక్కడా..........
అందుకే మా బాల్యాన్ని చిదిమేయద్దు 
మాకు మా ఆట పాట దూరం చేయద్దు.
**********