Thursday 2 August 2012

రెక్కలు తొడిగిన పసితనం

రెక్కలు తొడిగిన పసితనం 


నా పసితనమంతటి అమాయకత్వం 
నా బోసినవ్వంతటి స్వచ్ఛత 
నా ఆటలాంటి ఆనందం 
నా పాటలంత మాధుర్యం
నా మనసంతటి సున్నితత్వం 
నా అంతటి అందం 
నా అల్లరంత సంతోషం 
మరెక్కడైనా ఉందేమోనని 
రెక్కలు కట్టుకుని మరీ వెతికాను 
కానీ ఎక్కడా..........
అందుకే మా బాల్యాన్ని చిదిమేయద్దు 
మాకు మా ఆట పాట దూరం చేయద్దు.
**********

4 comments:

  1. అవును, ఎక్కడ వుండదు, చాలా చక్కగా రాశారండి,అభినందనలు. నా టపా కూడా పిల్లల మీదే.

    ReplyDelete
  2. చదువుల పేరుతో పిల్లలకు ఆటలను దూరం చేయటం మన రాష్ట్రం లో ప్రైవేటు పాటశాలల్లో జరుగుతున్న విషాదం.నైస్ పోస్ట్.

    ReplyDelete