Tuesday 14 August 2012

కల-నిజం

కల-నిజం 
మూసినా కనురెప్పల వెనుక స్వప్నం 
జీవితంలో ఎన్నడూ చూడని అందమైన రంగులు చూపుతూ 
తీరని కోర్కెలు తీర్చుతూ ఆనందడోలికల్లో ఊయలూగిస్తుంటే 
పరవశాన జారిన ఒక్కో ఆనందబాష్పం ఓ మకరంద బిందువు 
ఆ మకరందాన్నాస్వాదించేలోపే తట్టి లేపిందా వాస్తవం 
నా ఆశల, ఊహల, భావాల, మాటల గొంతునొక్కి,
తెరచిన నా కనులకు సంద్రపు బిందువులనలంకరించి,
మౌనమనే రంగు నా పెదవులకద్ది.
నిజం! భావాలొలికే నా కన్నులు గానీ 
పలికే నా పెదవులు గానీ ఎవరికవసరం?
భావ విహీనమైన నా మోము, అలంకృతమైన నా దేహం 
చాలును కదా మరి వారికి.
*********

10 comments:

  1. వీణ గారూ!
    చాలా చాలా బాగున్నాయి ముగింపు వాక్యాలు...
    నిజం! భావాలొలికే నా కన్నులు గానీ
    పలికే నా పెదవులు గానీ ఎవరికవసరం?
    భావ విహీనమైన నా మోము, అలంకృతమైన నా దేహం
    చాలును కదా మరి వారికి.

    అభినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. శ్రీ గారు ధన్యవాదాలు

      Delete
  2. వీణ గారూ, చక్కటి కవిత వాస్తవ ఆశల,ఊహల గొంతునొక్కటం.
    నిజమే మౌనమనే రంగు పెదవులకు అద్దుకొంటే ఇతర భావాలతో పనేముంది.
    చాలా బాగా రాశారు.

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారూ మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  3. ఆశలకు వాస్తవాలకు ఎప్పుడు దూరం ఉంటూనే ఉంటుంది.జీవితం అంతే!చాలా బాగా వ్రాసారు.

    ReplyDelete
    Replies
    1. అవును రవి శేఖర్ గారు ఆశలు ఊహలు ఎక్కువ సార్లు సమాంతర రేఖలుగానే మిగిలి పోతాయి ధన్యవాదాలు

      Delete
  4. ఊహలు వాస్తవాలైతే ఇంతందంగా ఉండవనే అలా ఆశలై మనల్ని అలరాడిస్తాయేమో:-)

    ReplyDelete
  5. అవును పద్మ గారు అందుకే చాల మంది ఊహలలోనే బ్రతికేస్తుంటారు:-)

    ReplyDelete
  6. చివరి ఆర్థ్రతా ఆ పదాలనంటిన తడి హత్తుకుంది వీణ గారూ..

    ReplyDelete
  7. వర్మ గారు నా బ్లాగ్ కు స్వాగతం మరియు మీ స్పందనకు ధన్యవాదాలు

    ReplyDelete