Wednesday 14 November 2012

'కల'వరం

'కల'వరం 
పున్నమి నడి రేయిన అపుడపుడే 
కలల ప్రపంచంలో అడుగిడుతున్న నన్ను 
చల్లటి నీ స్పర్శతో నిదురలేపిన క్షణం నాకు తెలియనే లేదు 
నా కలల ప్రపంచాన్ని వాస్తవంగా నాకందించబోతున్నావని 
నీ చేయి పట్టి నడిచే నా మానసంలో ఎన్నో ప్రశ్నలు 
ఐనా ఎంత ధైర్యమో నడిపించేది నీవని 
చూస్తుండగానే పచ్చని చేలపై తేలియాడుతున్న వెన్నెల సంద్రం 
కలో నిజమో తేల్చుకోలేని మధుర సంబ్రమాశ్చర్యంలో నుంచి 
ఇంకా తేరుకోని నన్ను స్పర్శించాలని ఆ చల్లగాలి ఆశపడినంతనే 
తన ఆశను అడియాశ చేస్తూ  
నాకు చేయందించి చిలిపి చూపులతో చేలోని మంచెపైకి ఆహ్వానించి 
వెచ్చని కౌగిలిలో నను బంధించిన నీకు 
ఏమేమో చెప్పాలన్న ఆరాటం నను మూగను చేస్తుంటే 
మాకు మాటలు వచ్చులే అంటూ 
మనసూ మనసూ ఎన్ని ఊసులు చెప్పుకుంటున్నాయో అంటూ 
తనువూ తనువూ గుసగుసలాడేంతలో 
తెల్లవారిందంటూ అలారం మ్రోగుతుంటే 
ఏది కలో ఏది నిజమో అన్న 'కల'వరంతో 
మేలుకున్నాయి నా కళ్ళు.
*******
 

9 comments:

  1. బాగుంది మీ కల వరం :-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మర్పితగారు :-)

      Delete
  2. కలవర మే కలరవమై కల"వర" మై...ఆనందం....బొమ్మ భావమంత అందంగా ఉంది..బాగుంది బాగుందోచ్!

    ReplyDelete
    Replies
    1. బాబాయి గారు ధన్యవాదాలు

      Delete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. తనువూ తనువూ గుస గుస లాడెంత లో ,
    అలారం అనే ఇంగ్లీసు పదం బదులు
    తెల్ల వారిందంటూ సూరీడు తొంగి చూస్తుంటే అని కానీ
    తెల్లవారిందంటూ కోడి కూస్తుంటే అని కానీ ఉంటె

    మీ కలవరం అచ్చ తెలుగు లో ఇంకా '' వెచ్చ గా '' ఉండేది వీణా !



    ReplyDelete
    Replies
    1. సుధాకర్ గారు మీ సూచనకు స్పందనకు కూడా ధన్యవాదాలు అలా రాయడానికి ప్రయత్నిస్తాను

      Delete
  5. 'కల' వరం ఆయెగా వీణాలహరి గారు:-)
    మంచి ఫీలుంది కవితలో..అభినందనలతో..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారు ధన్యవాదాలు

      Delete