Thursday 4 October 2012

అభిసారిక

 అభిసారిక 
ఎన్నో యుగాల నిరీక్షణలా తోస్తోంది నాకు 
నీకై వేచి చూస్తున్న ప్రతి క్షణమూ 
ఎంతసేపటి నుంచో నీ రాకకై నా ఎదురుచూపులు 
ఎంతకీ నీ జాడ కానరాదాయే
నా దృష్టి వీధి చివరికంటా సారించా 
నీవొస్తున్న దృశ్యం లీలగానైనా కనబడునేమోనని 
నా తలపులలో తప్ప నీ చిరునామా కనుగొనలేనైతి 
నీకై అభిసారికలా వేచి ఉన్న నాపై 
ఎన్నో తుంటరి చూపులు మరెన్నో అనుమానపు చూపులు 
మరికొన్ని జాలి చూపుల జల్లులలో 
తడిసి ముద్దవుతున్న ఆ క్షణం నీపై కోపంతో 
నా మోము ఎర్రవారుతున్నంతలో 
లీలగా నీవోస్తున్న సడి అంతే 
అంత కోపమేమాయెనో గానీ ఆ క్షణంలో 
నా ఆనందం కట్టలు తెంచుకున్న ఆ సెలయేటి ఝరే 
అంతవరకు నీ తలపులు మోస్తున్న నన్ను  అమాంతం ఎత్తుకుని 
చల్లని గాలిలో సేద దీర్చి నిద్రపుచ్చి నీవు సాగిపోతున్నావు 
ఇంతలో నా  గమ్యం రానే వచ్చింది ఇక ఈ రోజుకు నీకు వీడ్కోలు 
మరల రేపు మన కలయిక తప్పక వస్తావు కదూ 
నీకై వేచి చూస్తూ ఇక్కడే..........(బస్టాండులో)
మరువకు సుమా!
*********



12 comments:

  1. chaalaa baagundi mee bassu saarika. veena gaaru sardaagaa raasina andamaina kavitha

    ReplyDelete
    Replies
    1. bassu saarika naaku thattaneledu sumandi ee title bagunnattundi fathima garu mee spandanaku dhanyavaadaalu

      Delete
  2. బస్సు కోసం నీరీక్షణే
    ఓ కవితగా మారి పోయిందన్నమాట...
    బాగుంది వీణ గారూ!:-))
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. అవును శ్రీ గారు మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  3. బతుకు బస్ స్టాండే :)

    ReplyDelete
    Replies
    1. అయ్యో అంత కష్టమేమోచ్చిందండి

      Delete
  4. '' అంత వరకు నీ తలపులు మోస్తున్న నన్ను అమాంతం
    ఎత్తుకుని
    చల్లని గాలి లో సేద తీర్చి , నిద్ర పుచ్చి , నీవు సాగి పోతున్నావు ,
    ఇంతలో నా గమ్యం రానే వచ్చింది , ఇక ఈ రోజుకు నీకు
    వీడ్కోలు
    మరల రేపు మన కలయిక , తప్పక వస్తావు కదూ ! ''

    వాః ! చాలా బాగుంది వీణ గారూ మీ కవిత, రవి వర్మ చిత్రం తో పోటీ పడింది మీ కవిత,
    బస్సు స్టాండు కు బదులు ఒక ఉద్యాన వనం అన్నట్టయితే , ఇంకా బాగుండేది ( ఎందుకంటే
    చిత్రం లో అభిసారిక వనం లో వేచి ఉన్నట్టు గీయ బడింది కదా ! )
    అభినందనలు.

    ReplyDelete
    Replies
    1. సుధాకర్ గారు నా బ్లాగ్ కు స్వాగతం అభిసారికలా అని చెప్పడానికి ఆ చిత్రం వాడాను అంతే మీ విశ్లేషణకు స్పందనకు ధన్యవాదాలు

      Delete
  5. చాలా అందంగా వ్రాశారండీ!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు రసజ్ఞ గారు.

      Delete
  6. నిరీక్షణను కవిత్వీకరించిన విధం చాలా నచ్చిందండీ వీణ గారూ...

    ReplyDelete