Sunday 24 June 2012

నిరీక్షణ

నిరీక్షణ
ఆ కారుమేఘం కనులనిండా ఇంత నీరు నింపి పోయింది 
తొలకరికేనాడూ నే పులకరించలేదనేమో
ఆ చల్లగాలి ఒళ్లంతా ముళ్ళు గుచ్చి పోయింది 
ఆసాంతం తాకి పలకరించినా నే తనకేనాడూ బదులీయలేదనేమో
ఆ సుమ సుగంధాలు మనసుని మరింత బరువెక్కించాయి 
చెంత చేరిన పరిమళాన్ని నే నేనాడు ఆస్వాదించలేదనేమో
ఆ వెన్నెల నను నిలువనీయడం లేదు 
క్షణమైనా నే నేనాడు తన ఝరిలో తడవలేదనేమో
 
తెలియక చేసిన తప్పులని నను మన్నించక 
ఇంత కక్ష నా పై న్యాయమా
ఓ ప్రకృతి శ్రావణానికై నిరీక్షించే నను 
ఇకనైనా కనికరించవా .
*******

2 comments:

  1. చాలా బాగుంది! మీ నిరీక్షణకు ఒక తెర పడి తప్పక కనికరిస్తుందండీ!

    ReplyDelete
    Replies
    1. rasagna garu welcome to my blog and thank you very much.

      Delete