Saturday 23 June 2012

గుప్పెడు మనసు

గుప్పెడంతే ఉన్నానంటూనే 
ఎన్నో భావాల దొంతరలను దాచుకుంటుంది 
ఎన్నో ఊహలకు ఊపిరి పోస్తుంది 
ఎన్నో ఆశల సౌధాలకు పునాదులు వేస్తుంది 
మరెన్నో స్వప్నాలకు ఊతమిస్తుంది 

కాస్తంత సంతోషానికే కడలి తరంగమౌతుంది 
కొండంత విషాదమొస్తే ఆల్చిప్ప తానౌతానంటుంది

అనుభవాల వ్యవసాయం చేసి 
అనుభూతుల పంట పండిస్తుంది 

అలసి అప్పుడప్పుడు  స్తబ్దమోతుంది 
అంతలోకే నూతన చైతన్యంతో ఉరకలు వేస్తుంది 

కాస్త కలవరానికే కనుల వెంట జారి 
తన ఉనికిని చాటుకుంటుంది  

నిత్యం సంఘర్షణ రాజీలతో సతమతమౌతూనే 
నవ వసంతానికై  ఆశగా వేచిచూస్తుంది 
నా మనసు.
******

4 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. మీ గుప్పెడు మనసు గగనమ౦త భావాన్ని పలికింది.

    ReplyDelete
    Replies
    1. jyothirmayi garu welcome to my blog and thankyou very much.

      Delete
  3. '' నిత్యం సంఘర్షణ రాజీలతో సతమతమౌతూనే
    నవ వసంతానికై ఆశగా వేచి చూస్తుంది
    నా మనసు ''

    అత్భుతం గా ఉంది మీ కవిత !

    నిజం గానా వీణా ? !

    ReplyDelete