Friday 4 January 2013

మానసవీణ

మానసవీణ 
తూరుపు తీరంలో తెలతెలవారుతున్న వేళ
ఆ దినకరునికి స్వాగతం పలికే పక్షులు పాడే రాగం భూపాలం
భానుని లేత కిరణాల గిలిగింతలకు
తనువులూగుతున్న చివురాకు పాడే రాగం ధన్యాసి
మిట్టమధ్యాహ్నపు సూర్యుని  తీక్షణ లో
మెరుస్తూ కదలాడే ఆ కొబ్బరాకు పాడే రాగం సావేరి
పడమటి కనుమలలో అస్తమించే రవికి
వీడుకోలు చెప్పే వేళ గువ్వలు పలికే రాగం వసంతరాగం
చీకటి వేళ వెన్నెలతో వెలుగుతున్న
పుడమి గుండె పలికే రాగం నీలాంబరి
ఇన్ని రాగాలు వింటూ శృతి చేసిన
నా మానసవీణ పలికే రాగం శంకరాభరణం.
*********

4 comments:

  1. మీ రాగాలాపన బావుందండి.

    ReplyDelete
  2. మనసుదోచె మీ రాగం.

    ReplyDelete
  3. జీవితమే రాగ విపంచి :)

    ReplyDelete
  4. మరి శ్రీరాగం లేకుండా ముగించేశారు. చాలా బాగుంది.

    ReplyDelete